ఆత్మహత్యాయత్నం తర్వాతే కెరీర్ పతనం

Posted On:06-06-2015
No.Of Views:285

ప్రముఖ సినీనటి ఆర్తి అగర్వాల్ ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్రస్థాయి హీరోయిన్గా వెలుగొందారు. అయితే, అలాంటి సమయంలోనే ఆమె ఒకసారి ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆ తర్వాతి నుంచి ఆమె సినీ అవకాశాలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. తర్వాతే ఆమె ఉజ్వల్ కుమార్ అనే ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు.2001 నుంచి 2004 వరకు హవా నడిపించింది. తర్వాత ఆమె కెరీర్ పడిపోవడం, సినిమాల్లో వెనుకబాటు, ఆఫర్లు రాకపోవడం లాంటివి జరిగాయి. తర్వాత కూడా కొంతకాలం ఒకటీ అరా సినిమాల్లో నటించినా.. పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో మాత్రం లేదు. ఒకప్పుడు 'ఇంద్ర' లాంటి సినిమాలో చిరంజీవి సరసన ఆయనతో పోటాపోటీగా నటించిన ఆర్తి.. తర్వాత సునీల్ సరసన కూడా 'అందాల రాముడు' లాంటి సినిమాల్లో చేశారు.