వాడు నేను కాదు.. చిత్రం ప్రారంభం

Posted On:10-06-2015
No.Of Views:254

   రామ్‌ శంకర్‌, మహిమా నంబియార్‌, సుధాకర్‌, అలీ, కోవై సరళ, కృష్ణుడు, రవి, పచ్చముత్తు, సుమన్‌ శెట్టి ముఖ్యపాత్రలుగా డైరెక్టర్‌ కట్ప్‌ ఫిలిం కంపెనీ, రవి పచ్చముత్తు ఫిలిం ఫ్యాక్టరి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న వాడు నేను కాదు చిత్రం ప్రారంభోత్సవ వేడుకలు అన్నపూర్ణా 7 ఏకర్స్‌లో గురువారం జరిగాయి. ముహూర్తానికి నిర్మాత రవి, పచ్చముత్తు క్లాప్‌నివ్వగా ప్రముఖ న్యాయవాది రాం జఠ్మలానీ కెమెరా స్విచ్చాన్‌  చేసారు. తొలి సన్మివేశానికి ప్రముఖ దర్శక నిర్మాత ఏఎం రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన పాత్రికేయ సమావేశంలో హీరో రామ్‌శంకర్‌ మాట్లాడుతూ ‘‘అందరికీ నమస్కారం.. కొత్త నిర్మాతలు, దర్శకుడు, 5 భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోగా నటించడం ఆనందంగా ఉంది. స్నేహితుడు వినోద్‌విజయన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎంతో డిఫరెంట్‌గా ఉంటుంది. ఆరుగురు జాతీయ అవార్డ్‌ గ్రహీతలు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. నాలుగు భాషలో ఒకేసారి చిత్రం విడుదలవుతుంది.’’ అని అన్నారు. హీరోయిన్‌ మహిమానంబియార్‌ మాట్లాడుతూ ‘‘తెలుగులో తొలి చిత్రం, తమిళంలో ఏడు చిత్రాల వరకు చేసాను. తెలుగు భాషంటే చాలా ఇష్టం. కేరక్ట్‌ర్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని చేస్తున్నానని’’ చెప్పారు. సంగీత దర్శకుడు రాహుల్‌ రాజు మాట్లాడుతూ ‘‘తెలుగులో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. నిర్మాతల్లో ఒకరైన రవిపచ్చముత్తు మాట్లాడుతూ శుక్రవారం నుంచి రిగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది’’ అన్నారు. దర్శకుడు వినోద్‌విజయన్‌ మాట్లాడుతూ ఇది ప్రేమ కథా చిత్రం. ఆరు పాటలున్నాయి. హైదరాబాద్‌, తమిళనాడు, బెంగళూరు, కేరళ ప్రాంతాల్లో 120 రోజులపాటు జరిగే షెడ్యూలుతో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని’’ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా వివేక్‌హర్షన్‌, ఆర్ట్‌ తిరుమలమడుపు తిరుపతి, సాహిత్యం విశ్వ, రెహమాన్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కలిమిశెట్టి శ్రీదేవి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ ఎం. భాస్కర్‌, కో`డైరెక్టర్స్‌ జి. వెన్నెల, ప్రసాద్‌ వారా, రచనా సహకారం దిలీప్‌మధు, అంబికా రమ్య, నిర్మాతలు రవిపచ్చముత్తు, కె. మోహనన్‌, వినోద్‌విజయన్‌.