సింగం 123 ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక...

Posted On:10-06-2015
No.Of Views:268

  24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ హీరో, నిర్మాత మంచు విష్ణు, సంపూర్ణేష్‌ బాబు, సనమ్‌ ముఖ్య పాత్రలుగా అక్షత్‌ అజయ్‌శర్మ దర్శకత్వంలో రూపొందించిన ‘సింగం 123’ పాటల పరంగా ప్లాటినం డిస్క్‌ సాధించింది. ఈ వేడుకను రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డా॥ ఎం. మోహన్‌బాబు యూనిట్‌ సభ్యులకు ప్లాటినం డిస్క్‌లను ప్రదానం చేసిన తదుపరి మాట్లాడుతూ..‘ ఒక హీరో మరో హీరోని ప్రోత్సహించడం ఇదే తొలిసారి అనుకుంటున్నాను. రిస్క్‌ తీసుకుని  మా విష్ణు సంపూర్ణేష్‌ హీరోగా చిత్రాన్ని నిర్మించారు. చిత్రం చూసాకా సంపూర్ణేష్‌లో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనిపించింది. అంతబాగా చిత్రాన్ని తీసాడు, దర్శకుడు అక్షత్‌ అజయ్‌శర్మను దర్శకుడుగా పరిచయం చేయడాన్ని అభినందిస్తున్నాను. టేలెంట్‌ ఎక్కడవున్నా ప్రోత్సహించాలి. ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. తనకింత మంచి అవకాశాన్నిచ్చిన నిర్మాత విష్ణు, డా॥ మోహన్‌బాబులకు సంపూర్ణేష్‌ బాబు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నటులు పృధ్వి, చతుర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. శుక్రవారం ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల అవుతోంది.