పండగ చేస్కో సక్సెస్‌ మీట్‌...

Posted On:10-06-2015
No.Of Views:250

  యునైటెడ్‌ మూవీ ఆర్ట్స్‌ పతాకంపై పరుచూరి కిరీటి, రామ్‌, సోనాల్‌ చౌహాన్‌, రకుల్‌ ప్రీతీసింగ్‌ హీరో హీరోయిన్‌లుగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో అందించిన పండగ చేస్కో విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ యూత్‌, మాస్‌ను చిత్రం ఆకట్టుకుంటోంది. ద్వితీయార్ధం గంటా ఇరవైఐదు నిముషాలపాటు సాగిన సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మేం ఊహించిన దానికన్నా థియేటర్స్‌లో స్పందన లభిస్తోంది. బలుపు చిత్రం తర్వాత దర్శకుడు గోపీచంద్‌కు ఓ మంచి చిత్రంగా పండగచేస్కో నిలుస్తుంది. పంపిణీదారులందరూ చాలా హ్యేపీగా ఉన్నారని నిర్మాతకు అభినందన తెలిపారు. రచయిత కోనా వెంకట్‌ మాట్లాడుతూ రొటీన్‌ కథా చిత్రాలను ఇక ముందు కూడా తీస్తామని, సమీక్షలకు చిత్రం వసూళ్ళకు ఎటువంటి సంబంధం ఉండటం లేదని ఈ చిత్రం వసూళ్ళు నిరూపిస్తున్నాయని అన్నారు. చిత్రంలో కామెడీతోపాటు విలన్‌ పాత్ర పోషించిన సంపత్‌రాజ్‌ మాట్లాడుతూ ఓ మంచి పాత్రలో ప్రేక్షకుల ఆదరణ పొందేలా నన్ను తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలకు రచయిత కోనా వెంకట్‌, అద్భుతమైన నటన ప్రదర్శించిన రామ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.వి. వినాయక్‌ మాట్లాడుతూ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. రామ్‌ నటన, బలుపు తర్వాత దర్శకుడు గోపీచంద్‌కు మంచి విజయం లభించడం పట్ల హర్షాన్ని వ్యక్తంచేసారు. అనంతరం యూనిట్‌ సభ్యులకు జ్ఞాపికలను ప్రధానం చేసారు. హీరోయిన్స్‌ సోనాల్‌ చౌహాన్‌, రకూల్‌ ప్రీతీసింగ్‌, రచయిత వెలుగొండ శ్రీనివాస్‌, చిత్ర విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తంచేసారు. రామ్‌ మాట్లాడుతూ ‘డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.’ అని అన్నారు. దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి వుంటాను. కుటుంబ కథాచిత్రం చెయ్యాలనే ఉద్దేశంతో పండగచేస్కో చిత్రం తీసాను. ఫ్యామిలీ డ్రామాతో పాటు ఎమోషనల్‌ ట్రావెల్‌ అవుతుంది. రామ్‌ నా బ్రెదర్‌లాంటి వాడు అతనికి ఇంత మంచి విజయం లభించడం సంతోషంగా ఉంది’అని అన్నారు. 
    కార్యక్రమంలో నిర్మాత పరుచూరి కిరీటి, పరుచూరి ప్రసాద్‌, ప్రముఖ నిర్మాత శ్రవంతి రవికిశోర్‌, ఏ. ప్రకాష్‌, రచయిత దర్శకుడు అనీల్‌రావిపూడి, ఎడిటర్‌ గౌతమ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.