సుష్మా దర్శన్‌ క్రియేషన్‌ ఫిదా... ప్రారంభం

Posted On:10-06-2015
No.Of Views:265

 అభినయ్‌ దర్శన్‌, మధుమిత, అజిత్‌ శుక్లా, కోట, సప్తగిరి ముఖ్యపాత్రలుగా నిర్మాత సత్యనారాయణ సుష్మాదర్శన్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ‘ఫిదా’ చిత్రం షూటింగ్‌ ముహూర్తం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ముహూర్తానికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ క్లాప్‌, పద్మినీ నాగవల్లి కెమెరా స్విచ్ఛాన్‌ చేసారు  తొలి సన్నివేశానికి కాదంబరి కిరణ్‌కుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హీరోయిన్‌ మధుమిత మాట్లాడుతూ, ‘ఇదో డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ. కాలేజీ గర్ల్‌గా అందరినీ ఆకర్షించే పాత్ర చేస్తున్నానని’ చెప్పారు. హీరో అభినయ్‌ దర్శన్‌ మాట్లాడుతూ మంచి కథ, మంచి సంస్థలో పనిచేస్తున్నాను. పదిరోజుల తరువాత రిగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. 35 రోజుల్లో షూటింగ్‌ పూర్తవుతుందని చెప్పారు. నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ ‘తొలిచిత్రం, కథనచ్చి  దర్శకుని మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని చేస్తున్నానని చెప్పారు.