రోడ్డు ప్రమాదంలో సినీ నటి, తెదేపా నేత కవితకు గాయాలు

Posted On:20-06-2015
No.Of Views:279

జగ్గయ్యపేట: సినీ నటి, తెదేపా నేత కవిత శనివారం కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. కవిత ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగ్గయ్యపేట ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం ఆమెను మరో వాహనంలో హైదరాబాద్‌కు పంపారు.