సోషల్ నెట్వర్క్ లో సంచలనం..లెస్బియన్ యాడ్

Posted On:23-06-2015
No.Of Views:337

 భారత్ వంటి సంప్రదాయ దేశాల్లో నూట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం  ఉద్యమాలు జరిగుథున్నాయి. . ఇదే కోవలో ఇటీవలే విడుదలైన లెస్బియన్ కపుల్ యాడ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సంప్రదాయవాదులు ఈ యాడ్ ను వ్యతిరేకిస్తున్నప్పటికీ... సామాజిక వెబ్ సైట్లలో ఇది పెద్ద దుమారమే సృష్టిస్తోంది. అయితే.. ఈ రకమైన సంబంధాలను ప్రజలు హర్షించే విధంగా తెరపై ఆవిష్కరించడంలో బాలీవుడ్ జనాల శైలే వేరు. తెలుగునాట గే కామెడీ చిన్న చిత్రాలలో ప్రధానంగా కనిపిస్తున్నా... ఈ కాన్సెప్ట్ ను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించడంలో హిందీ దర్శకులు కృతకృత్యులయ్యారు.నలభైలలో దేశంలో బ్యాన్ కు గురైన రచయిత ఇస్ మత్ చుగ్టై కథ లిహాఫ్ ఆధారంగా ధేఢ్ ఇష్కియాలో పతాక సన్నివేశాన్ని చిత్రీకరించాడు దర్శకుడు అభిషేక్ చౌబే. బేగమ్ పరా, ఆమె సహాయకురాలు మున్నియాగా నటించిన ప్రముఖ నటీమణి మాధురీ దీక్షిత్, హ్యూమా ఖురేషీ సినిమా చివర్లో ఒక్కటయ్యే సన్నివేశం ప్రేక్షకుల హృదయాలనూ గెలుచుకుంది.తాజాగా బోంబే వెల్వెట్ సినిమాలో గే గా నటించిన కరణ్ జోహార్... తన సొంత చిత్రం బాంబే టాకీస్ లో ఈ అంశాన్ని మరింత లోతుగా చర్చించాడు. సామాజిక కట్టుబాట్లకు లోబడి వివాహ వ్యవస్థలో చిక్కుకుంటోన్న నపుంసక పురుషులు ఎలాంటి వేదన అనుభవిస్తున్నారో చూపించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ చిత్రంలో గే కపుల్ గా నటించిన రణ్ దీప్ హూడా, సాఖిబ్ సలీమ్ మధ్య సాగే ముద్దు సన్నివేశం..
సేమ్ సెక్స్ రొమాన్స్ లపై ఇప్పటివరకూ వచ్చిన చిత్రాలు ఒకెత్తు అయితే... 1996లో దీపా మెహతా తెరకెక్కించిన ఫైర్ చిత్రం మరొకెత్తు. భర్తల అనురాగానికి నోచుకోలేక బాధపడే ఇద్దరు తోడికోడళ్లు ఒకరి సాంగత్యంలో మరొకరు సేదతీరిన తీరును దీపా తెరపై ఆవిష్కరించారు. అందులో లెస్బియన్ కపుల్ గా నటించిన షబానా ఆజ్మీ, నందితా దాస్... తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి. అయితే.. సమాజం ఏమాత్రం హర్షించలేని సమయంలోనే ఈ రకమైన సంబంధాలను తెరకెక్కించిన దీపామెహతా పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది!