రోడ్డుపై మంత్రులు

Posted On:23-06-2015
No.Of Views:263

ఒక్కరోజు ప్రచారం కోసం ఆర్‌కే నగర్‌లో జయ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేలు రోడ్డుపైనే కూర్చోవడం చర్చనీయాంశమైంది. తిరువొత్తియూరు హైరోడ్‌ జంక్షన్‌, ఎన్నూర్‌ హైరోడ్‌ జంక్షన్‌లలో జయ పర్యటన సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె వ్యాన్‌కు కొద్దిదూరంలో నిలబడ్డారు. అయితే వ్యాన్‌లో కూర్చొని జయ ప్రసంగిస్తుండడంతో వెనుకవైపు వున్న ప్రజలకు ఆమె కనిపించడం లేదని కేకలు వినిపించగానే, తెల్లదుస్తులు ధరించిన మంత్రులు కొద్దిగా పక్కకు తప్పుకోగా, ఎమ్మెల్యేలు మాత్రం భద్రతా సిబ్బంది కనుసైగలతో ఎక్కడివారక్కడే జయ ప్రసంగం ముగిసేవరకూ రోడ్డుపై కూర్చుండిపోయారు.