ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంబీబీఎస్‌

Posted On:23-06-2015
No.Of Views:243

కోల్‌కాత: ఇంజనీరింగ్‌ విద్యలో వినూత్న విధానం, సరికొత్త కోర్సులతో.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌ మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఐఐటీ చరిత్రలోనే తొలిసారిగా.. ఎంబీబీఎస్‌ కోర్సును అందించేకు ఏర్పాట్లు చేస్తోంది. 2017నుంచి ఖరగ్‌పూర్‌ ఐఐటీలో మెడికల్‌కోర్సు ప్రవేశ పెడుతున్నట్లు ఐఐటీ వర్గాలు ప్రకటించాయి. ఇందుకోసం 400 పడకల సూపర్‌-స్పెషాలిటీ ఆసుపత్రి, డాక్టర్‌ బీసీ రాయ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సిద్ధమవుతున్నాయి.