వీరప్పన్‌, ప్రభాకరన్‌ విగ్రహాలకు పూజలు

Posted On:23-06-2015
No.Of Views:251

చెన్నై,ఎల్టీటీఈ అధినేత వి.ప్రభాకరన్‌, స్మగ్లర్‌ వీరప్పన్‌లను అసలుసిసలు ‘తమిళబిడ్డలు’గా అభివర్ణిస్తూ తమిళనాడులో నాలుగేళ్లుగా పూజలు నిర్వహిస్తున్న వైనమిది. విల్లుపురం జిల్లా కందమంగళం సమీపంలోని సడయాండికుప్పం గ్రామం వెలుపల అయ్యనారప్పన్‌ ఆలయం లోని అయ్యనారప్పన్‌ విగ్రహానికి ఇరువైపులా వీరప్పన్‌, ప్రభాకరన్‌ల విగ్రహాలున్నాయి. వాటిని తొలగించాలన్న పోలీసుల ఆదేశాలను గ్రామ పెద్దలు పెడచెవిన పెట్టడంతో వివాదం నెలకొంది.