15 రోజుల్లో ఇద్దరు జర్నలిస్టుల హత్య

Posted On:23-06-2015
No.Of Views:248

భోపాల్‌: ఉత్తరప్రదేశ్‌లో జగేంద్ర సింగ్‌ హత్య ఘటనను మరవకముందే మధ్యప్రదేశ్‌లో సందీప్‌ కొఠారి అనే జర్నలి్‌స్టను ఇసుక మాఫియా బలిగొంది. ఈ నెల 19న అదృశ్యమైన కొఠారి మహారాష్ట్రలోని వాద్రా ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ పక్కన విగతజీవిగా కనిపించాడు. ఆయనకు అంత్యక్రియలు చేసేందుకు కుటుంబం నిరాకరించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఆరుగురు నిందితులను కచ్చితంగా అరెస్టు చేస్తామనే హామీ ఇస్తేనే దహన సంస్కారాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని మరికొందరిని కూడా త్వరలోనే పట్టుకొంటామని అడిషనల్‌ సూపరింటెండెంట్‌ నీరజ్‌ సోనీ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో హత్యకు గురైన జగేంద్ర సింగ్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై రెండు వారాల్లోగా తమ వైఖరి తెలపాలని కేంద్రం, యూపీ ప్రభుత్వంతో పాటు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు నోటీసు జారీ చేసింది.