ఒకే ఊరికి 18 ఐఐటీ ర్యాంకులు

Posted On:23-06-2015
No.Of Views:295

గయ: ఆ ఊర్లో.. చదువుల తల్లి కొలువై ఉన్నదేమో!? ఐఐటీ పరీక్షల్లో ఆ గ్రామస్తులు సాధిస్తున్న ర్యాంకులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బీహార్‌లో గయ సమీపంలోని బుంకరోన్‌ గ్రామంలో 18 మందికి ఐఐటీ ర్యాంకులొచ్చాయి. ఇలా ర్యాంకుల రావటం అక్కడ కొత్తేం కాదు. ఏటా కనీసం పదిమంది ఐఐటీ ర్యాంకులు సాధిస్తున్నారు. అంతకు ముందు ర్యాంకులు సాధించిన వాళ్లు.. తర్వాత వచ్చే విద్యార్థులకు తమ పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ ఇవ్వటంతోపాటు మార్గదర్శనం చేయటాన్ని ఓ బాధ్యతగా తీసుకుంటారు. ఓ ఎన్జీవో కూడా వీలైనంత సహాయం చేస్తోంది.