గుండె జబ్బు బాధితులకు స్మార్ట్‌ఫోన్‌తో ముప్పు

Posted On:23-06-2015
No.Of Views:291

ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చి జేజేలందుకున్న స్మార్ట్‌ఫోన్‌.. గుండె జబ్బు బాధితుల విషయంలో మాత్రం విలన్‌గా నిలిచిపోనుంది. ముఖ్యంగా గుండె పనితీరును నియంత్రించేందుకు పేస్‌మేకర్‌ అమర్చుకున్న వారు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ నుంచి వెలువడే విద్యుదయస్కాంత సంకేతాలను పేస్‌మేకర్‌ కార్డియాక్‌ సిగ్నళ్లుగా పొరబడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు ఈ సంకేతాలు పేస్‌మేకర్‌ పనితీరును కొంతసేపు ఆపేస్తాయని ఈ పరిశోధనకు నేతృత్వంవహించిన డాక్టర్‌ కార్‌స్టెన్‌ లెనెర్జ్‌ వివరించారు.