బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అంటున్న ప్రభాస్

Posted On:23-06-2015
No.Of Views:260

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. త్వర‌లోనే తాను బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నానని స్వయంగా ప్రభాసే ప్రక‌టించాడు. ప్రస్తుతం విడుదలకు సిధ్దంగా ఉన్న ‘బాహుబ‌లి’ హిందీ వెర్షన్ ప్రమోష‌న్‌లో భాగంగా ముంబ‌యిలో ప‌ర్యటిస్తున్న ప్రభాస్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. బాహుబ‌లి ట్రైల‌ర్ చూసిన హిందీ అభిమానులు ప్రభాస్‌కి ఫ్యాన్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. క‌ర‌ణ్ జోహార్ నిర్మాణ సార‌ధ్యంలో వ‌స్తున్న సినిమాకు బాలీవుడ్‌లో క్రేజ్ పెరుగుతోంది. ఈనేప‌థ్యంలో ప‌లువురు బాలీవుడ్ ద‌ర్శక‌, నిర్మాతల నుంచి ప్రభాస్‌కు ఆఫ‌ర్స్ వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమనే చెప్పవచ్చు. ఇప్పటికే ప‌లువురు టాలీవుడ్ యంగ్ స్టార్స్ బాలీవుడ్‌లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. ఈ కోవలో ప్రభాస్‌కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి...