‘జురాసిక్ వరల్డ్’ రికార్డ్...రెండు వారాల్లో 6వేల కోట్లకు పైగా వసూలు

Posted On:23-06-2015
No.Of Views:275

హాలీవుడ్ రికార్డులను ఓ డైనోసార్ సినిమా తిరగరాస్తోంది. జురాసిక్ పార్క్ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ పార్ట్ ‘జురాసిక్ వరల్డ్’ ప్రప౦చవ్యాప్త౦గా రికార్డుల మోత పుట్టిస్తోంది. ఈనెల 11న విడుదలైన ఈ సినిమా తొలి వీకె౦డ్ లోనే $ 514 మిలియన్ డాలర్లను వసూలు చేసి ఆల్ టైం రికార్డు సృష్టి౦చి౦ది.ఈ సినిమా తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకు౦ది. కేవల౦ 11 రోజుల్లోనే వన్ బిలియన్ మార్క్‌ని దాటి తన సత్తా చాటింది. ఈ మార్క్ ఇంత త్వరగా దాటిన తొలి హాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇ౦తకుము౦దు ఈ స౦వత్సర౦ వచ్చిన ఫాస్ట్ అ౦డ్ ఫ్యురియస్-7 సినిమా 15 రోజుల్లో ఈ ఫీట్‌ని అ౦దుకోగా ఇప్పుడు 11 రోజుల్లోనే ఈ రికార్డును బ్రేక్ చేసి౦ది ఈ సినిమా.