షూటింగ్‌లో గాయపడిన అలియా

Posted On:23-06-2015
No.Of Views:274

బాలీవుడ్‌ తార అలియా భట్‌ భుజానికి గాయమైంది. తమిళనాడులోని కూనూర్‌లో ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ సినిమా షూటింగ్‌లో ఆమె కుడి భుజానికి దెబ్బ తగిలింది. అయితే రెండు వారాల్లో తను మామూలు మనిషినవుతానని తెలిపింది అలియా. ‘‘మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. కెరీర్‌ తొలి నాళ్లలోనే భుజానికి గాయం. నేను ఒత్తిడి ఫీలవట్లేదు. రెండు వారాల్లో నేను మళ్లీ ఫిట్‌ అవుతాను’’ అని ట్వీట్‌ చేసింది. తన కుమార్తె త్వరగా కోలుకోవాలని కాంక్షించిన అభిమానులకు నటి సోనీ రజ్దాన్‌ సైతం కృతజ్ఞతలు తెలియజేసింది. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ చిత్రానికి షకున్‌ బాత్రా దర్శకుడు. ఈ సినిమాతో పాటు వికాస్‌ బెహల్‌ రూపొందిస్తున్న ‘షాన్‌దార్‌’లోనూ నాయికగా నటిస్తోంది అలియా.