కైలాశ్‌ యాత్రకు రెండో మార్గాన్ని తెరచిన చైనా

Posted On:23-06-2015
No.Of Views:271

నాయ్‌దుయ్‌లా (చెనా): భారత యాత్రికులు సులువుగా కైలాశ్‌`మానసరోవర్‌ తీర్థయాత్రను చేపట్టేందుకు సిక్కిం సరిహద్దులోని నాథౖ లాను సోమవారం చైనా తెరచింది. గత నెల ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటించినప్పుడు ఇరుదేశాల మధ్య విశ్వాసాన్ని నెలకోల్పే చర్యల్లో భాగంగా నాథౖ లాను తెరుస్తామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. 2013 ఉత్తరాఖండ్‌ వరదల వల్ల దెబ్బతిన్న లిపుల్షేా పాస్‌ ద్వారా వెళ్లే కాలిబాట మొదటి మార్గం కాగా.. నూతనంగా నాథౖ లా నుంచి టిబెట్‌ మీదుగా 1500 కి.మీ రోడ్డు మార్గం రెండొది. భారత్‌లో రెండు వారాల ముందు బయల్దేరిన తొలి బృందంలోని మొత్తం 44 మంది సోమవారంనాడు నాథౖ లా దాటి చెjనాలోకి అడుగుపెట్టారు.