పాట పాడిన జయప్రద

Posted On:28-06-2015
No.Of Views:277

జయప్రద గొప్ప అభినయాన్ని ప్రదర్శించగల నటి అన్న విషయాన్ని ఈవేళ ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. అయితే, ఆమెలో మంచి సింగర్ కూడా ఉందన్న విషయం మాత్రం కొందరికే తెలుసు. గతంలో 'సీతారాములు' వంటి ఒకటీ అరా సినిమాలలో తన గొంతు వినిపించింది. ఇప్పుడు తాజాగా ఓ తమిళ సినిమాలో పూర్తి స్థాయిలో ఆమె ఓ పెప్పీ నెంబర్ ఆలపించింది. తన అక్క కొడుకు సిద్ధూ హీరోగా నటిస్తున్న 'ఉయిరే ఉయిరే' (తెలుగు సినిమా ఇష్క్ రీమేక్) తమిళ చిత్రంలో జయప్రద ఈ పాట పాడడం జరిగింది. దీని గురించి ఆమె చెబుతూ, "జావేద్ అలీతో కలసి ఈ పాట పాడాను. రేపు రికార్డింగ్ అనగా ఆ రాత్రల్లా పాటను ప్రాక్టీస్ చేస్తూనే వున్నాను. ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను" అని తెలిపింది.