వరలక్ష్మితో కటీఫా?

Posted On:28-06-2015
No.Of Views:289

నటి వరలక్ష్మితో నటుడు విశాల్ సన్నిహి త సంబంధాలకు బ్రేక్ పడిందా? ప్రస్తుతం కోలీ వుడ్లో జరుగుతున్న హాట్‌హాట్ టాపిక్ ఇదే. దీనికి కారణం లేకపోలేదు. నడిగర్ సంఘం ఎ న్నికల వ్యవహారంలో శరత్‌కుమార్ వర్గానికి, విశాల్ వర్గానికి మద్య గట్టి పోటీ నెలకొన్న విష యం తెలిసిందే. అదేవిధంగా శరత్‌కుమార్ కూ తురు, నటి వరలక్ష్మికి నటుడు విశాల్&కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం ఉంది. దీంతో శరత్‌కుమార్, విశాల్ జట్టుల్లో మీ మద్దతు ఎవరికుంటుదన్న ప్రశ్నకు నటి వరలక్ష్మి నిర్మోహమాటంగా నా మద్దతు నాన్నకే అని స్వష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో విశాల్, వరలక్ష్మి మధ్య బెడిసికొట్టిందా? అనే చర్చ కోలీవుడ్‌లో మొదలైంది. దీనిపై స్పందించిన విశాల్ వరలక్ష్మి నిర్ణయం సబబేనన్నారు. నడిగర్ సంఘం వ్యవహారంలోకి ఆమె ను లాగడం న్యాయం కాదని విశాల్ అన్నారు.