హైదరాబాద్ బాబు జాగీర్ కాదు: కడియం

Posted On:28-06-2015
No.Of Views:269

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సెక్షన్-8, యూటీ అంటూ పూటకొక డిమాండ్ చేస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని, హైదరాబాద్ తెలంగాణ ఆస్తి అని, బాబు జాగీర్ కాదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్లోని రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మహిళా వసతి గృహానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.