మళ్లీ వస్తా: సీఎం కేసీఆర్

Posted On:28-06-2015
No.Of Views:258

 ఫాంహౌస్‌కు మళ్లీ వస్తా.. అప్పటి వరకు అల్లం పంట విత్తే పనులు అయిపోవాలి. ఆలస్యం చేయొద్దు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో ఆదివారం బాధ్యులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఐదు రోజులుగా ఫాంహౌస్‌లోనే గడిపిన కేసీఆర్.. మధ్యాహ్నం 3:40 గంటలకు తన కాన్వాయ్‌లో హైదరాబాద్ బయలుదేరారు. కాన్వాయ్ సిద్ధం కాగానే మళ్లీ ఓ సారి అల్లం పంట విత్తే సాగు వైపు వెళ్లి కూలీలతో మాట్లాడి పలు సూచనలు చేసినట్టు తెలిసింది.