అద్వానీజీ చెప్పింది కరెక్టే..

Posted On:28-06-2015
No.Of Views:281

పాట్నా: దేశంలో అత్యవసర పరిస్థితి వచ్చే ప్రమాదం లేకపోలేదని, కేంద్రంలో ఒక వ్యక్తి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ అన్న మాటలతో తాను ఏకీభవిస్తున్నానని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. జేడీయూ నేత అనంత్ సింగ్ అరెస్టు వ్యవహారంపై తొలిసారి నోరు విప్పిన ఆయన తనను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు బీజేపీ నేతలు చేస్తున్నారని ఆరోపించారు.ఏ విషయానికి ఎలా ప్రతిస్పందిచాలో కూడా వారికి అర్థం కావడం లేదని, వారికి తెలిసినదల్లా రాజకీయాల్లో హింస సృష్టించడం, అసహ్యకరంగా ప్రవర్తించడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. అద్వానీ జీ ఎంతో అనుభవశాలి అని, ఆయన ఎన్నో అనుభవాలుచూసుకుంటూ వస్తున్నారని, ఆయనలా అన్నారంటే దానికి కచ్చితంగా కారణం ఉంటుందని చెప్పారు.