ఫైనల్లో జ్వాల జోడీ

Posted On:28-06-2015
No.Of Views:271

కల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం గుత్తా జ్వాల జోడీ దూసుకెళ్తోంది. మహిళల డబుల్స్లో జ్వాల, అశ్వినీ పొన్నప్ప ద్వయం ఫైనల్లో ప్రవేశపెట్టింది. సెమీఫైనల్లో జ్వాల, అశ్విని 21-17, 21-16 స్కోరుతో జపాన్ క్రీడాకారిణులు షిహొ టనక, కొహరు యొనెమొటోపై౦ విజయం సాధించారు.  కాగా ఈ టోర్నీలో ఇతర భారత క్రీడాకారులు ఇంతకుముందే వైదొలిగారు.