సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి

Posted On:28-06-2015
No.Of Views:264

విజయవాడ: కృష్ణాజిల్లాలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. మృతురాలు రాణియే ఈ కేసులో నిందుతురాలని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.తన ప్రియుడిపై దాడి చేయించాలనుకున్న ఆమె ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఆమె ప్రాణాలు పొగొట్టుకుంది. తనతో సహజీవనం చేస్తున్న కఠారి రాజేష్‌కు వారం రోజుల క్రితం పెల్లి కుదరడంతో అతడిపై యాసిడ్ దాడి చేసేందుకు ఇద్దరు యువకులతో రాణి ఒప్పందం కుదుర్చుకుంది.పథకం ప్రకారం కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసర పల్లి సమీపంలో బుడమేరు వంతెన వద్ద శుక్రవారం రాత్రి రాజేష్, రాణిలపై యాసిడ్ దాడి జరిగింది.
దాడి సమయంలో రాణి బైకుపై నుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడిన ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకుని పోలీసుల విచారించారు.దాడి ఘటనకు ముందు రాణి ఎవరెవరితో మాట్లాడింది అనే దానిపై దర్యాప్తు జరపడంతో పోలీసులు ఈ కేసును చాలా సులభంగా చేధించగలిగారు. దాడి ఘటనలో మహిళ, ఆమె స్నేహితుడు రాజేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు.బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాణి అనే ఆ మహిళ మరణించింది. రాణి భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసింది.