ఇపుడు టాలీవుడ్ హాటెస్ట్ ఐటం గర్ల్ హంసా నందిని

Posted On:28-06-2015
No.Of Views:229

తెలుగు సినిమా పరిశ్రమలో ఐటం సాంగుల ఆనవాయితీ ఎన్టీఆర్ కాలం నుండి ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు జయమాలిని, జ్యోతి లక్ష్మి, డిస్కో శాంతి లాంటి వాళ్లు ఇండస్ట్రీని ఐటం సాంగులతో ఓ ఊపు ఊపితే.... ఆతర్వాత ముమైత్ ఖాన్ లాంటి వారు తమ హవా కొనసాగించారు. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో ఐటం గర్ల్ గా తన హవా కొనసాగిస్తోంది హాట్ బ్యూటీ హంసా నందిని. మిర్చి, అత్తారింటికి దారేది, భాయ్, రామయ్యా వస్తావయ్యా, లెజెండ్ లాంటి చిత్రాల్లో హంసా నందిని అందరగొట్టింది. తాజాగా హంసా నందిని గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'లౌక్యం' చిత్రంలో ఐటం సాంగు చేస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసారు. సినిమా విడుదలకు ముందే ఈ ఫోటోలు విడుదల చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. లౌక్యం సినిమా విషయానికొస్తే...ఇదిక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన ఈ చిత్రానికి కథ అందించారు. గోపీచంద్, రాకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు. బ్రహ్మానందం, కోవై సరళ, చంద్ర మోహన్, సంపత్ రాజ్, ప్రదీప్ రావత్, పోసాని, రఘుబాబు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హంసా నందిని స్పెషల్ సాంగు చేస్తోంది.