హైకోర్టులో స్టీఫెన్‌సన్‌కు చుక్కెదురు

Posted On:29-06-2015
No.Of Views:218

హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. జెరూసలెం మత్తయ్య హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మార్చాలని కోరుతూ స్టీఫెన్‌సన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు దానిని కొట్టివేసింది. స్టీఫెన్‌సన్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిఆదేశించారు.