కెనడా ఓపెన్ గెలుచుకున్న గుత్తా జ్వాల, అశ్విని జోడీ

Posted On:29-06-2015
No.Of Views:258

కాల్గరి(కెనడా): భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీ కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటింది. మహిళల డబుల్స్ టైటిల్ ఫైనల్లో సెలెనా పీక్- మస్కెన్స్ జోడీపై 21-19, 21-16 తేడాతో గెలుపొందారు. జ్వాల, అశ్విని ఎదురుదాడితో మ్యాచ్ 35 నిమిషాల్లోనే ముగిసింది. 
కేసీఆర్ అభినందన : కెనడా ఓపెన్ గెలిచిన గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీకి కేసీఆర్ అభినందనలు తెలిపారు. వీవి విజయం భారత క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతుందని కొనియాడారు.