రేవంత్‌రెడ్డికి జులై 13 వరకు రిమాండ్ పొడిగింపు

Posted On:29-06-2015
No.Of Views:294

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడైన తెలంగాణ తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఆయనకు జులై 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. గతంలో విధించిన రిమాండ్ గడువు ముగియడంతో రేవంత్‌రెడ్డిని పోలీసులు ఈరోజు కోర్టులో హాజరు పరిచారు. ఏసీబీ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి రేవంత్‌రెడ్డికి రిమాండ్ పొడిగించారు.