సెక్షన్-8 అమలుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

Posted On:29-06-2015
No.Of Views:298

హైదరాబాద్: హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. సెక్షన్-8 అమలులో కేంద్రం పాత్ర ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం ఆదేశిస్తేనే గవర్నర్ సెక్షన్-8 అమలు చేయాలని విభజన చట్టంలో లేదు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ పిటిషన్ అసంపూర్తిగా ఉన్నందున కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.