రెండు రోజుల్లో స్పందిస్తా: పవన్ కల్యాణ్

Posted On:29-06-2015
No.Of Views:273

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసుపై రెండురోజుల్లో స్పందిస్తానని సినీనటుడు, జనసేవ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంతో పాటు ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8పై మరో రెండు రోజుల్లో ప్రెస్మీట్ పెడతానని ట్విట్ చేశారు. ఒకవేళ రెండు రోజుల్లో వీలు కాకుంటే ఈ వారం చివర్లో కానీ, లేదా వచ్చే వారం కానీ ప్రెస్మీట్ పెడతానన్నారు.ప్రజలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది పాలకుల విజ్ఞత అని, మన పాలకులు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా వ్యవహరించబోతున్నారన్నది చూస్తామంటూ పవన్ ట్విట్ చేశారు. తల్లి తండ్రులు తిట్టుకుంటు లేస్తే పిల్లలు కొట్టుకుంటు లేస్తారని అంటారు. అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో,మాటలుతో ప్రభుత్వాలనినడిపితే భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి. అని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.కాగా ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అన్న జనసేన అధినేత... దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నోటుకు కోట్లు వ్యవహారం జరిగి దాదాపు నెల తర్వాత స్పందించడం గమనార్హం. రెండు రోజుల క్రితం ఆయన తెగేవరకూ లాగొద్దు అంటూ ట్విట్ చేసిన విషయం తెలిసిందే.