పొట్టి స్కర్ట్స్, టీ షర్టులు వద్దు...

Posted On:29-06-2015
No.Of Views:244

కోలకతా: కోలకతాలోని ఓ ప్రముఖ కళాశాల యాజమాన్యం జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. తమని కనీసం సంప్రదించకుండా ఇలాంటి నిబంధనలుతగవంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే... కోలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు డ్రెస్కోడ్ విధిస్తూ నోటీసులు జారీ చేసింది.అబ్బాయిలు రౌండ్ నెక్ టీ షర్టులు, కాప్షన్స్, పిచ్చిరాతలు ఉన్న టాప్స్,అమ్మాయిలు పొట్టి గౌనులు ధరించి కాలేజీకి రావడాన్ని నిషేధించింది. విద్యార్థినీ విద్యార్థులు విధిగా పొడుగు చేతుల చొక్కాలు, చీరలు, సల్వార్ కమీజులు మొదలైన దుస్తులు ధరించి కళాశాలకు రావాలని సూచించింది. దీంతోపాటు అబ్బాయిలు చెవులకు రింగులు ధరించడాన్ని కూడా తప్పు బట్టింది.ఇక కళాశాల యాజమాన్యం నిర్ణయంపైవిద్యార్థి సంఘాలు సోమవారం నుంచి ఆందోళన దిగాయి. మరోవైపు ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి అనాగరిక నిబంధనలా అంటూ మేధావులు విమర్శిస్తున్నారు. విద్యార్థుల స్వేచ్ఛా స్వాత్యంత్ర్యాలకు ఇదితీరని భంగపాటు అంటూ అనేకమంది విద్యావేత్తలు  ఉద్యమకారులు విరుచుకుపడుతున్నారు.