మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు

Posted On:29-06-2015
No.Of Views:266

హైదరాబాద్: వర్షాకాల విడిది సందర్భంగా హైదరాబాద్‌కు విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన రాష్ట్రపతితో సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై రాష్ట్రపతితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.