రేవంత్ బెయిలు పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

Posted On:29-06-2015
No.Of Views:220


హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితులు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహాలు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లపై మంగళవారం హైకోర్టు నిర్ణయం వెల్లడించనుంది. గత శుక్రవారం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో.. తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం బెయిలు మంజూరు చేయడానికి నిరాకరించడంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.