జులై 1నుంచి డిజిటల్ తెలంగాణ ప్రారంభం

Posted On:30-06-2015
No.Of Views:244

హైదరాబాద్: జులై 1న రాష్ట్రంలో 'డిజిటల్ తెలంగాణ' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జలహారం, ఇంటింటికీ ఓఎఫ్‌సీ, 4జీ సర్వీసులు, నగరాలు, పట్టణాల్లో వైఫై సదుపాయం, ఈ-పంచాయతీ లక్ష్యంగా డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వారం రోజులపాటు డిజిటల్ తెలంగాణపై అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి.
* జులై 1న ప్రధాని మన్‌కీ బాత్ ప్రసారం. 
* 2న గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు. 
* 3న డివిజినల్, జిల్లాస్థాయిలో డిజిటల్ తెలంగాణపై శిక్షణ. 
* 4న జిల్లాస్థాయిలో డిజిటల్ తెలంగాణపై పోటీలు, చర్చలు. 
* 5న హైదరాబాద్‌లో 5కె రన్, డిజిటల్ రాహ్‌గిరి. 
* 6న రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ డిజిటల్ ఇండియా, అవార్డుల ప్రదానం, ఒప్పందాలపై సంతకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.