కేసీఆర్ను పరామర్శించడానికే వచ్చా: డీఎస్

Posted On:01-07-2015
No.Of Views:251

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని తెలిసి పరామర్శించడానికి వచ్చానని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం డీఎస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఇతర నేతలు పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న విషయాన్ని మాత్రం డీఎస్ ప్రస్తావించలేదు.కాగా శాసనమండలిలో తిరిగి అవకాశం ఇవ్వనందుకు అసంతృప్తికి గురైన డీఎస్ హస్తానికి చేయిచ్చి, కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఈనెల 6వ తేదీన గులాబీ కండువా కప్పుకోనున్నారు.