చిన్నారులను పరామర్శించిన అల్లుఅర్జున్

Posted On:01-07-2015
No.Of Views:248

హైదరాబాద్: క్యాన్సర్‌తో బాధపడుతున్న నలుగురు చిన్నారులను సినీ హీరో అల్లు అర్జున్ ఈరోజు పరామర్శించారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న అల్లు అర్జున్ వారిని కలుసుకుని ఉల్లాసంగా గడిపారు. చిన్నారుల పరిస్థితిని వైద్యులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చివరిదశలో ఉన్న చిన్నారుల కోరిక తీర్చడం గొప్ప విషయమని. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న మేక్ ఎ విష్ సంస్థకు అందరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ దశలో పిల్లలకు సాయం చేయడం కంటే మనోధైర్యం ఇవ్వడమే ముఖ్యమన్నారు.