లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

Posted On:01-07-2015
No.Of Views:242

ముంబై:అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.గ్రీస్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లను ప్రభావితంచేస్తోంది. ముఖ్యంగా మరోసారి ఆసియాలో మరోసారి మాంద్యం పరిస్ధితులు తలెత్తుతాయనే అమోమయంలో ఇన్వెస్టర్లు ఆచితూచీ అడుగులేస్తున్నారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు 176 పాయింట్ల లాభంతో 27వేల 957పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా , నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 8420 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.ఇక సెక్టార్ సూచీల్లోహెల్త్కేర్1.28శాతం, క్యాపిటల్గూడ్స్1.10శాతం, ఐటి సూచీలు 1.06శాతం, రియాల్టీ 1.22శాతం లాభపడుతున్నాయి. ఇక నిఫ్టీ టాప్గేయిన్ర్స్లిస్ట్లో అంబుజా సిమెంట్2.33శాతం, సిప్లా 1.71శాతం, హెచ్సిఎల్టెక్1.66శాతం, ల్యూపిన్ 1.64శాతం లాభపడుతుండగా, నిఫ్టీ టాప్ లూజర్స్లిస్టలో జీల్ 1.26శాతం, ఎన్డిసి 1.05శాతం, గెయిల్0.57శాతం నష్టపోయాయి.