కపిల్ శర్మకు అనారోగ్యం... కామెడీ నైట్స్‌కు విరామం

Posted On:01-07-2015
No.Of Views:253

 హైదరాబాద్: టెలివిజన్‌లో బహుళ ప్రజాదరణ పొందిన హిందీ కామెడీ షో 'కామెడీ నైట్స్ విత్ కపిల్' వ్యాఖ్యాత కపిల్ శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రసుత్తం సల్మాన్ ఖాన్‌తో కార్యక్రమం చిత్రీకరణ పూర్తి కావచ్చిందని, అది కాగానే షోకి విరామం ఇచ్చి తాను కొంతకాలం విశ్రాంతి తీసుకుంటానని కపిల్ పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖులు తమ చిత్రాల ప్రమోషన్‌కి కపిల్ కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవడం తెలిసిందే.