అథ్లెటిక్స్ పోటీలకు ముస్తాబవుతున్న బర్డ్స్ నెస్ట్..

Posted On:01-07-2015
No.Of Views:295

 హైదరాబాద్: పక్షి గూడు లాంటి స్టేడియంను మీరు ఎక్కడైనా చూశారా? అచ్చం పక్షి గూడులా కనిపించే స్టేడియం చైనాలోని బీజింగ్‌లో ఉంది. బీజింగ్‌లోని నేషనల్ స్టేడియంకు మరో పేరే బీజింగ్ బర్డ్స్ నెస్ట్. వచ్చే నెలలో జరగనున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకి ఈ స్టేడియం ముస్తాబు అవుతోంది. ఈ అథ్లెటిక్స్ పోటీలు ఆగస్టు 22 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ వీటిని నిర్వహిస్తోంది.