రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ ఉత్తర్వులను సవరించిన హైకోర్టు

Posted On:01-07-2015
No.Of Views:248

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లో ఏర్పడిన గందరగోళానికి హైకోర్టు తెరదించింది. బెయిల్ ఉత్తర్వుల్లో 'ఏసీబీ పోలీసులు' అన్న పదానికి స్పష్టత ఇవ్వాలని రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులు ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఉత్తర్వుల్లోని సాంకేతిక అంశాలను సరిచేస్తూ పూచీకత్తులను ఏసీబీ న్యాయస్థానంలో సమర్పించాలని సూచించింది. దీంతో ఆయన తరపు న్యాయవాదులు సాయంత్రంలోగా పూచీకత్తులు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.