ఏడు నెలల్లో 1.5లక్షల ఈ-వీసాలు జారీ

Posted On:01-07-2015
No.Of Views:215

 హైదరాబాద్ : భారత్‌ని పర్యాటకానికి స్వర్గధామంగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంతో కేంద్రప్రభుత్వం ఈ - వీసాల విధానాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏడు నెలల్లో భారత్‌కు వచ్చే పర్యాటకులకు 1.5లక్షల ఈ-వీసాలను ఇప్పటి వరకు మంజూరు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి లలిత్ కె. పన్వర్ తెలిపారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పర్యాటకులకు ఈ-వీసాల్ని జారీ చేయలేదని చెప్పారు.