వైద్యురాలి కాలర్ సరిచేసిన మంత్రి.. హల్‌చల్ చేస్తున్న ఫొటో

Posted On:01-07-2015
No.Of Views:309

 జమ్మూకశ్మీర్ రాష్ట్ర మంత్రి చౌదరీ లాల్ సింగ్ ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ తెల్లకోటు(ఆప్రాన్) కాలర్ సరిచేశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జమ్మూకశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ అమర్‌నాథ్ యాత్ర ఏర్పాట్లలో భాగంగా లఖన్‌పూర్‌లో ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ వైద్యురాలితో మాట్లాడుతూ.. ఆమె తెల్లకోటు కాలర్ సరిగా లేకపోవడంతో దాన్ని చేత్తో సరిచేశారు. వైద్యురాలు ఏమీ అభ్యంతరం చెప్పలేదని అక్కడే ఉన్న మరో సీనియర్ వైద్యురాలు తెలిపారు. అంతేకాకుండా మంత్రి కాలర్ సరిచేయడం చూసి అక్కడే ఉన్న మరో వైద్యురాలు కూడా తన కాలర్ సరిచేసుకున్నారని తెలిపారు. గతంలో ఓ మహిళా వైద్యురాలిని మానసికంగా వేధించారని చౌదరీ లాల్ సింగ్‌పై ఆరోపణలు ఉన్నాయి.