"యూనిట్ సభ్యులకు సమంతా కానుక"

Posted On:01-07-2015
No.Of Views:346

వెండితెర మీద .. యాడ్ బోర్డ్స్ పైనా .. షాపింగ్ మాల్స్ లోనే కాదు, సామాజిక సేవకి సంబంధించిన విషయాల్లోనూ సమంతా ముందువరుసలో కనిపిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాల్లోనూ .. ఆర్థికపరమైన సహాయ సహకారాలను అందించడంలోను ఆమె పేరు వినిపిస్తూనే వుంటుంది. అలాంటి సమంతా తాజాగా తన సినిమా యూనిట్లోని వారికి ఒక్కొక్కరికి 5000 రూపాయలను ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది. ధనుష్ జోడీగా ఆమె 'వీఐపీ 2' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి పనిచేసే వారందరి సంతోషం కోసం ఒక్కొక్కరికీ 5000 రూపాయలను కానుకగా ఇచ్చింది. తమ సినిమాకి పనిచేసినవాళ్లు హ్యాపీగా వుండాలనే ఉద్దేశంతో కానుకలు అందించడం రజనీకాంత్ కీ .. అజిత్ కి అలవాటు. సమంతా కూడా అదే బాటలో నడుస్తోందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.