‘జస్ట్‌ఫ్రెండ్స్’

Posted On:01-07-2015
No.Of Views:312

షార్ట్ ఫిల్మ్ రివ్యూ

ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఎంతో ప్రేమ ఉన్నా, పెళ్లికి సమయం దాటవేస్తుండటంతో ప్రేయసి తన స్నేహితురాలితో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని హాస్యపరిమళాన్ని కాస్తంత ఎక్కువగా జోడించి చిత్రీకరించిన జస్ట్ఫ్రెండ్స్ లఘుచిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బుల్లితెర నటుడు, సినీనటుడు భరత్రాజ్ ప్రధాన పాత్రలో మేఘన, సుచిస్మితలు నటీమణులుగా సినిమా టికెట్ సంస్థ ఈ లఘుచిత్రాన్ని నిర్మించింది.తన స్నేహితురాలితో కలిసి యువకుడికి కోపం తెప్పించి, తనలో మార్పును ఎలా తీసుకొచ్చారనే అంశానికి కామెడీ జోడించి పండించడంలో సఫలీకృతమయ్యాడు దర్శకుడు అర్షద్. భరత్ తన ప్రేమను తన స్నేహితులకు వివరిస్తూ తన ప్రేయసి స్నేహితురాలిపై ఉన్న కోపాన్ని, తమ ప్రేమ మధ్య ఎల్లప్పుడూ అడ్డంగా ఉండే ఆమెపై కోపం ఎలాంటి పరిణామాలకు దారితీసిందో చెప్పే సీన్లు కడుపుబ్బా నవ్వించాయి. ఈ చిత్రానికి మాటలు శ్రీతేజ అందించగా, సంగీతం మెహర్ చంటి, నిర్మాతగా దుశ్యంత్ వ్యవహరించారు.