నాపై చెత్త కామెంట్లు చేయకండి: సన్నీ లియోన్

Posted On:01-07-2015
No.Of Views:301

ఐటెం గర్ల్ రాఖీ సావంత్, హీరోయిన్ సెలినా జైట్లీలు తనమీద చెత్త కామెంట్లు చేయడం సరికాదని సన్నీ లియోన్ మండిపడింది. 'ఎంటీవీ స్ప్లిట్స్విల్లా 8' కార్యక్రమం ఆవిష్కరణలో వాళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యల మీద స్పందించాల్సిందిగా కోరినప్పుడు.. ఆమె తీవ్రంగా మండిపడింది. వాళ్లు చేసినవి పనికిమాలిన, చెత్త కామెంట్లని, వాటికి ఏమాత్రం ఆధారాలు లేవని, అలా వ్యాఖ్యానించడం అనైతికం అని చెప్పింది. నటీనటులు ఇంత దారుణంగా మాట్లాడం ఎప్పుడూ చూడరని వాపోయింది. అదేదో వాళ్ల సమస్య తప్ప తనది కాదని, వాటిని తాను లెక్కచేసేది లేదని సన్నీ స్పష్టం చేసింది.తానిక్కడ పని చేయడానికే వచ్చానని, దానిమీదే దృష్టి పెడతానని తెలిపింది. సన్నీ లియోన్ మరీ పల్చటి దుస్తులు వేసుకుంటోందని, దానివల్ల ఆమెలాగే మిగిలినవాళ్లు కూడా అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తోందని రాఖీ వ్యాఖ్యానించింది. సన్నీ లియోన్ భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని డిమాండ్ కూడా చేసింది. ఇక సెలెనా జైట్లీ అయితే.. సన్నీలియోన్, ఆమెభర్త తాము అద్దెకు తీసుకున్న ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవాలని చెప్పింది.