కీలక పాత్ర లో మీనా కూతురు నైనిక

Posted On:02-07-2015
No.Of Views:292

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలాంటి అగ్ర కథానాయకులందరి సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మీనా. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు తెలుగు తెరకు దూరమైనా ఇటీవల మళ్లీ 'దృశ్యం'తో మెరిసింది. తన వయసుకు తగ్గ పాత్రలతో తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ సందడి చేస్తోంది. త్వరలోనే ఆమె తన వారసురాల్ని కూడా తెరపై చూసుకోబోతోంది. విజయ్ కథానాయకుడిగా అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో మీనా కూతురు నైనిక ఓ కీలక పాత్ర పోషిస్తుందట. సినిమాలో విజయ్‌కి ఓ కూతురు ఉంటుందట. ఆ పాత్రలో నైనిక నటిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. దీంతో మీనాని సంప్రదించారు. ఆమె వెంటనే ఓకే చెప్పేసినట్టు సమాచారం. అన్నట్టు మీనా కూడా చిన్నప్పుడే కెమెరా ముందుకొచ్చింది. బాలనటిగానూ ఆమె అప్పట్లో అభిమానుల్ని సంపాదించుకొంది.