రేవంత్‌రెడ్డి కేసులో తెలంగాణ ఏసీబీ పక్షాన వాదించనున్న సీనియర్‌ లాయర్లు

Posted On:02-07-2015
No.Of Views:298

ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ఏసీబీ పక్షాన సుప్రీంకోర్టులో సీనియర్‌ లాయర్లు వాదించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డి కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ పక్షాన వాదనలు వినిపించేందుకు సీనియర్‌ లాయర్లు అయిన కపిల్‌సిబల్‌, దుష్యంత్‌దవే, హరేన్‌రావెల్‌లను రంగంలోకి దించనుంది. గురువారం టీఏసీబీ చీఫ్‌ ఏకేఖాన్‌ సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు రేవంత్‌రెడ్డి బెయిల్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని సమాచారం. అందువల్లే సీనియర్‌ లాయర్లను టీ ఏసీబీ పక్షాన వాదించేందుకు సమాయత్తం చేసింది.