తెరపైకి శ్రీదేవి వారసురాళ్లు?

Posted On:02-07-2015
No.Of Views:303

    అతిలోకసుందరికి పేటెంట్ శ్రీదేవినే. ఎవర్గ్రీన్ హీరోయిన్గా వెలుగొందుతున్న శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ను పెళ్లాడిన తరువాత కూడా కొంతకాలం నటించి తరువాత ఇద్దరు పిల్లలకు తల్లి అయిన వారి సంరక్షణ బాధ్యతలో భాగంగా నటనకు దూరం అయ్యారు. పిల్లలిద్దరూ యుక్త వయసుకు వచ్చారు. దీంతో శ్రీదేవి సుదీర్ఘ విరామం తరువాత ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న పులి చిత్రంలో మహారాణిగా ముఖ్య భూ మికను పోషిస్తున్నారు.దాదాపు రెండు దశాబ్దాల తరువాత శ్రీదేవి నటిస్తున్న తమిళ చిత్రం ఇది. శ్రీదేవి తన కూతుళ్లు జాహ్నవి, ఖుషీకపూర్లను హీరోయిన్లుగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం. అందుకామె కథలు వింటున్నారని త్వరలోనే కూతు ళ్లు చిత్రాలకు సంబంధించిన ప్రకటన అధికారిక పూర్వకంగా వెలువడే అవకాశం ఉందని సి నీ వర్గాల సమాచారం. అయితే ఆమె తన కూతుల్లకు తొలుత బాలీవుడ్లో పరిచయం చేస్తారా? లేక దక్షిణాదిలోనే అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది