చర్లపల్లి కారాగారానికి భద్రత పెంపు

Posted On:04-07-2015
No.Of Views:290

హైదరాబాద్: ఐబీ అధికారుల హెచ్చరికలతో చర్లపల్లి కారాగారానికి భద్రత పెంచారు. చర్లపల్లి జైలులో ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాది యాసిన్ భత్కల్ జైలు అధికారిక ఫోన్ నుంచి తన భార్య, తల్లిదండ్రులతో 10 సార్లు మాట్లాడిన సంభాషణలను జైలు అధికారులు నమోదు చేశారు. భత్కల్ చరవాణి సంభాషణలను క్షుణ్నంగా విశ్లేషించిన జాతీయ దర్యాప్తు సంస్థ చర్లపల్లి కారాగారానికి భద్రత పెంచాలని సూచించింది. త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానని యాసిన్ భత్కల్ ఫోన్‌లో తన బంధువులకు చెప్పినట్లు ఎన్ఐఏ అధికారులు నిర్థరించారు.