రేవంత్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు

Posted On:04-07-2015
No.Of Views:318

ఓటుకు నోటు కేసులో ఎన్నికల కమిషన్ (ఈసి) కూడా రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, రేవంత్ రెడ్డితో పాటు ఇతర నిందితులరిమాండ్ డైరీ, ఫిర్యాదుదారుడితోపాటు రేవంత్ వాంగ్మూలం రికార్డు సర్టిఫైడ్ కాపీలను కోర్టు ద్వారా ఈసీ పొందినట్టు తెలిసింది. దీంతో ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిన రేవంత్‌పై తాము కూడా విచారణ జరుపుతామని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. కోర్టు నుంచి లిఖితపూర్వక నివేదికలు రావటంతో కేంద్ర ఎన్నిక ల సంఘానికి పూర్తిస్థాయి నివేదికను పంపించేందుకు సిద్ధమవుతున్నట్టు ఈసీ వర్గాల ద్వారా తెలిసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బులిస్తూ అడ్డంగా పట్టుబడ్డ వ్యవహారంపై ఎప్పటికప్పుడు ఏసీబీ ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు నివేదిక అందిస్తున్నారు.